హమారా ప్రసాద్ అరెస్టు సేసిన రాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు
ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కుల సంఘాల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ జన్ను రవి అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకుడు చంటి భద్రయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవాన్ని కల్పించిందని రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్‌పై...