Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Author
Posted By Telangana Vaartha
| 03 Nov 2026, 12:01 AM | తెలంగాణ Telangana
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీసు శాఖలో దీర్ఘకాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు అధికారులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు శాఖలో పనిచేయడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని అన్నారు. ఉద్యోగ జీవితమంతా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన అధికారుల సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.ఉద్యోగ విరమణ అనేది సేవలకు ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. రిటైర్ అవుతున్న అధికారులు తమ అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన అధికారులు మహమ్మద్ అలీముద్దీన్ (ఎస్‌.ఐ), అహ్మద్ ఖాన్ (ఏర్ఎస్‌ఐ) లను జిల్లా ఎస్పీ శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగ కాలంలో అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన అధికారులు మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పనిచేసిన ప్రతి రోజు తమ జీవితంలో ఒక మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. తమ సేవా కాలంలో సహకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సహోద్యోగులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేసే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్, జాయింట్ సెక్రటరీ

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.