Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మున్సిపాలిటీ సమగ్ర అభివృద్దికి కట్టుబడి వున్నాము

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 09:46 PM | తాజావార్తలు Flash News
మున్సిపాలిటీ సమగ్ర అభివృద్దికి కట్టుబడి వున్నాము

ముఖ్యమైన పాయింట్స్:

  • మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట:- ప్రజా ప్రభుత్వంలో సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డులలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణంలోని నాలుగో వార్డు నేత్యా తండాలో ఐదు లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో నిర్మాణం చేయనున్న సిసి డ్రైన్ కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో నాలుగో వార్డు కు 21 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయి, నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. నాలుగో వార్డ్ లో బోర్ వెల్ తో పాటు పైపులైన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు అనే తేడా లేకుండా అన్ని వార్డులలో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, సూర్యాపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్దికి కట్టుబడి వున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బుక్యా జ్యోతి లింగ నాయక్, ఎ.ఇ తిరుమలయ్య, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రముఖులు వాజిద్ మియా, సలీం ఆఫ్ ఖాన్, శ్రీనివాసరెడ్డి, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.