Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చినుకు పడితే చిత్తడే ....మా కాలనీకి సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మించండి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 28 Oct 2026, 08:49 PM | తెలంగాణ Telangana
చినుకు పడితే చిత్తడే ....మా కాలనీకి సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మించండి

తిరుమలగిరి 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
వర్షాకాలంలో కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి కాలువల్లో మురుగు నీరు ప్రవహించక దుర్గంధ పారిశుధ్యం క్షీణించడంతో ప్రబలుతున్న అంటువ్యాధులు అల్లాడిపోతున్నామని ప్రజలు వివరించారు తిరుమలగిరి మండలం కోకియా నాయక్ తండ గ్రామం ఐదవ వార్డులో చిన్నపాటి వర్షం పడినా మట్టి రోడ్లు అన్నీ బురదమయంగా మారి కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేని కాలనీల్లో వర్షపు నీరు మట్టి రోడ్లపై నిలిచి దుర్వాసన వస్తుంది సిసి రోడ్డు నిర్మాణం లేదు సైడ్‌ కాలువలు నిర్మించకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి. కాలువల్లో పూడిక సక్రమంగా తీయక మురుగు నీరు ప్రవహించే వీలులేదు. దీంతో మురుగు నీరు ఇంటి పరిసరాల్లో నిల్వ ఉంటోంది. వర్షం వస్తే మురుగునీరు ఇంట్లోకి చేరుతుంది. దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రోడ్డు డ్రైనేజీ కాలువ విద్యుత్ స్తంభాలు నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని కోరారు. ...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.