Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నూతన పట్టణ అధ్యక్షునికి ఘనంగా సన్మానం

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 26 Oct 2026, 09:31 PM | తెలంగాణ Telangana
నూతన పట్టణ అధ్యక్షునికి ఘనంగా సన్మానం

తిరుమలగిరి 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కేసిడి వెంకట లక్ష్మారెడ్డిని తొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన అధ్యక్షుడు వెంకట లక్ష్మారెడ్డి తన వంతు కృషి చేయాలని నాయకులు అన్నారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వెంకట లక్ష్మారెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవింద్ రెడ్డి గోపాల్ రెడ్డి రామారావు కొండ చంద్రయ్య మైనాల రాజయ్య పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.