Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జనగామలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Author
Posted By Telangana Vaartha
| 25 Oct 2026, 06:34 PM | తాజావార్తలు Flash News
జనగామలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జనగామలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, జనగామ కలెక్టరేట్‌ సమీపంలోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది.

ఉదయం 7 గంటల సమయంలో తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.