Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:21 PM | తాజావార్తలు Flash News
కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు ఆరుతడి పంటలైన కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో రెండు ఎకరాల్లో వంగ, మునగ తోటలు సాగు చేస్తున్న బోయపల్లి సరోజ వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వంగ, మునగ సాగులో లాభనష్టాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన బిందు సేద్యం పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎరువులను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల సాగు చేపడుతున్న రైతును అభినందించారు. అనంతరం అలుగునూరు శివారులో సాదు రామకృష్ణారెడ్డి 14 ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను సందర్శించి సాగు విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, తుంగతుర్తి డివిజన్ ఉద్యాన అధికారి వి. ప్రమిత, మండల వ్యవసాయ అధికారి దివ్య, విస్తరణ అధికారులు ముత్యం రాజు, సుధాకర్‌రెడ్డి, రాము, ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ భద్రాచలం, భవిష్య, తహసీల్దార్ హామీన్ సింగ్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారీ చేయనైనది

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.