Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఏమిటి అవస్థలు... ఎందుకు ఈ వ్యవస్థలు

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:20 PM | తాజావార్తలు Flash News
ఏమిటి అవస్థలు... ఎందుకు ఈ వ్యవస్థలు

పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగుల పడిగాపులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ కోసం నిలబడలేక, ఎండకు తట్టుకోలేక, టిఫిన్ చేయడానికి పోతే సీరియల్ పోతది అనే బెంగతో, షుగర్, బీపీ లతో చెమటలు పడుతున్నా, కాళ్లు గుంజుతున్నా, ప్రాణం వణుకుతున్నా, విసుగు పుట్టుకొస్తున్నా, ఆయాసం ఎక్కువ అవుతున్నా, ఆవేశం ఉన్నప్పటికీ పెదవి పంటి మాటున కోపాన్ని దాచుకుని, పేదవాడి కోపం పెదవికి చేటు ఎందుకులే అని గుణుక్కుంటూ, ఎండలో తప్పక నిలబడని స్థితి.
దయనీయ పరిస్థితి. పెన్షన్ల పంపిణీ కోసం అందర్నీ ఒకచోట కాకుండా వీలైనంత ఎక్కువగా వేరే వేరే ప్రదేశాలలో కౌంటర్లు ఏర్పాటుచేసి సత్వరంగా అందించాలని వృద్ధులు, వికలాంగులు కోరుతున్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.