Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌కు ఖమ్మం ఎకో-క్లబ్‌కు ఆహ్వానం

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 07:33 PM | తాజావార్తలు Flash News
జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌కు ఖమ్మం ఎకో-క్లబ్‌కు ఆహ్వానం

ఖమ్మం:- ఖమ్మం జిల్లాకు చెందిన ఎకో-క్లబ్ ఎన్విరాన్‌మెంటల్ సొసైటీకి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నిర్వహించనున్న జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కడవెండి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కె.అరుణ కుమారికి ఆహ్వాన పాసులు అందాయి . సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత, భిన్నత్వంలో ఏకత్వం చాటిచెప్పే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా డా. వేణుగోపాల్ మాట్లాడుతూ జాతీయ ఐక్యతా స్ఫూర్తితో పాటు ‘ప్లాస్టిక్ రహిత భారత్ – పచ్చని భారత్’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఖమ్మం నుంచి జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల ఎకో-క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.