Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రైతులు ఎల్ నినో పరిస్థితి బట్టి మెదులుకోవాలి

Author
Posted By Telangana Vaartha
| 22 Oct 2026, 07:45 PM | తాజావార్తలు Flash News
రైతులు ఎల్ నినో పరిస్థితి బట్టి మెదులుకోవాలి

అడ్డగూడూరు 22 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి,ఎల్ నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డి రేపాక,కొండంపేట గ్రామాల్లో వర్షాభావ పరిస్థితి,తాగునీటి సాగునీటి సమస్యలు,చేపట్టవలసిన చర్యల గురించి గ్రామ సభలను నిర్వహించడం జరిగినది.ఇట్టి గ్రామ సభలకు మండల స్థాయి అధికారులు హాజరై వర్షాభావ పరిస్థితిని,తీసుకోవాల్సిన చర్యలను జాగ్రత్తలను ప్రజలకు వివరించడం జరిగినది.వరి పంట వేయకుండా,నీటి వినియోగం తక్కువ ఉండే ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేయాలని, నీటిని, విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఇట్టి గ్రామ సభల్లో మండల ప్రత్యేక అధికారి(జిల్లా మత్స్య శాఖ అధికారిణి)సుకీర్తి, ఎంపీడీవో శంకరయ్య తాసిల్దార్ శేషగిరిరావు,ఎంపీఓ జనార్ధన్ రెడ్డి,రేపాక సర్పంచ్ శ్రీకాంత్,వ్యవసాయ అధికారి పాండురంగ చారి,మిషన్ భగీరథ ఏఈ రవి,ఏపీవో రవీందర్ ఇతర గ్రామ స్థాయి అధికారులు రైతులు పాల్గొన్నారు.

రైతులు ఎల్ నినో పరిస్థితి బట్టి మెదులుకోవాలి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.