Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ రక్షణ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్

Author
Posted By Telangana Vaartha
| 21 Oct 2026, 11:25 PM | తెలంగాణ Telangana
తెలంగాణ రక్షణ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్

ఖమ్మం:- తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుడు, యువ నాయకుడు షేక్ హుస్సేన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనను ఈ పదవిలో నియమించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, పలు పోరాటాలు, సభలు, సమావేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాలో కీలక పాత్ర పోషించారు. కల్వకుంట్ల కవితకు నమ్మకమైన అనుచరుడిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యత అప్పగించిన కవితకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హుస్సేన్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు ఎల్లవేళల్లో అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని అన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.