Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇసుక ట్రాక్టర్ల యజమాన్యం ధర్నా

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 15 Oct 2026, 06:19 AM | తెలంగాణ Telangana
ఇసుక ట్రాక్టర్ల యజమాన్యం ధర్నా

తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న శాండ్ టాక్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, శాండ్ టాక్స్ విధానంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఉపాధిపై ఆధారపడి జీవించే తమకు ఈ సమస్యల వల్ల ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోయిందని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న శాండ్ టాక్స్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.