Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అత్యంత వైభవముగా అట్ల బతుకమ్మ వేడుకలు

Author
Posted By Telangana Vaartha
| 14 Oct 2026, 11:17 PM | ఖమ్మం Khammam, తెలంగాణ Telangana
అత్యంత వైభవముగా అట్ల బతుకమ్మ వేడుకలు

ఖమ్మం నగరంలో బుధవారం విజయనగర్ కాలనీ 56వ డివిజన్ శ్రీ షిరిడి సాయి బాబా మందిర ప్రాంగణంలో ఐదవరోజు అట్ల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవముగా జరుపుకున్నారు. మహిళందరూ భారీగా తరలి రావడం తో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ ఉయ్యాల పాటలతో, చప్పట్లు ఆటలతో, కోలాటాలతో ఆడుకోవడం జరిగింది. అనంతరం ప్రసాద వితరణ, బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అత్యంత వైభవముగా అట్ల బతుకమ్మ వేడుకలు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.