Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సైబర్ మోసాల నివారణకు ప్రజలను ఉండాలి.

Author
Posted By Telangana Vaartha
| 14 Oct 2026, 11:04 PM |
సైబర్ మోసాల నివారణకు ప్రజలను ఉండాలి.

- బాధితులకు సత్వర పోలీస్ సేవలు.
- దర్యాప్తులు వేగవంతం చేసి కేసుల్లో శిక్షలు పడేలా సిబ్బంది కృషి.
- అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు.
కోదాడ డివిజన్ పోలీస్ అధికారుల సమీక్షలో జిల్లా ఎస్పీ కె. నర్సింహ ఐపీఎస్ ఆదేశాలు

Suryapet:- సైబర్ మోసాల నివారణకు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భద్రత కల్పించాలని, పోలీసు సేవలు అందించడంలో ఆలస్యం చేయొద్దు అని జిల్లా ఎస్పీ కె.నర్సింహ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కోదాడ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, నేరస్తులకు శిక్షలు పడేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించాలని, పోలీస్ సేవలు అందించడంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని సూచించారు. సామాజిక అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలన్నారు. కేసుల దర్యాప్తులను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేసి, నిర్దేశించిన సమయంలోనే కోర్టులకు పంపించాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తు సమయంలో సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి, నమోదు చేయాలని, కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణతో పాటు కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. దొంగతనాల నివారణలో భాగంగా బ్యాంకులు, ఏటీఎంలు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించే కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిఘా పెంచాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు, భౌతిక దాడులు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి ఘటనలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. పట్టణాల్లో న్యూసెన్స్ సృష్టిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్లపై ఆక్రమణలను అరికట్టి, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచి, సమాచారం సేకరించాలని, వాటికి పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట బైండోవర్ చర్యలు చేపట్టి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మగ్దుం అలీ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు శివశంకర్, చరమంద రాజు, రామకృష్ణారెడ్డి, ప్రతాప్ లింగం, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ మోసాల నివారణకు ప్రజలను ఉండాలి. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.