Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన ఎస్పి నరసింహ

Author
Posted By Telangana Vaartha
| 13 Oct 2026, 04:22 AM | క్రైమ్ న్యూస్ Crime News
పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన ఎస్పి నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రజా ఫిర్యాదులపై వేగంగా పోలీస్ సేవలు : జిల్లా ఎస్పీ నరసింహ.

సూర్యాపేట :- సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వినతులను పరిశీలించారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా రక్షణ కోసం పోలీసు సిబ్బంది అనుక్షణం విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు దాడులకు పాల్పడకుండా ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన ఎస్పి నరసింహ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.