Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Author
Posted By Telangana Vaartha
| 09 Oct 2026, 07:46 PM | తాజా సమాచారం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు.
(సూర్యాపేట జిల్లా అక్టోబర్ 9)
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా ఆడపడుచులందరికీ తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, పంతంగి వీరస్వామి గౌడ్. ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా ఉండి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్సవాలు ఐక్యతతో, ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడా లేనివిదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎంగిలి పువ్వు తో ప్రారంభమయ్యే బతుకమ్మ, దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.