Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రఘునాథపాలెంలో జూదంపై పోలీసుల దాడి

Author
Posted By Telangana Vaartha
| 09 Oct 2026, 07:42 PM | తాజా సమాచారం
రఘునాథపాలెంలో జూదంపై పోలీసుల దాడి

డబ్బులతో జూదం ఆడుతున్న 9 మంది అరెస్ట్‌
రూ.15,200 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులో డబ్బులతో జూదం ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఠంపల్లి ఎస్‌ఐ బి. ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి, వారి వద్ద నుంచి రూ.15,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, జూదంలో పాల్గొన్న వారి వివరాలపై దర్యాప్తు చేపట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.