Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వాహనదారులు పోలీస్ నిబంధనలు పాటించాలి ఎస్సై వెంకట్ రెడ్డి

Author
Posted By Telangana Vaartha
| 09 Oct 2026, 12:55 PM |
వాహనదారులు పోలీస్ నిబంధనలు పాటించాలి ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 9 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ భాగంలో వాహనదారులకు సమావేశం ఏర్పాటు చేశారు. మైనర్ పిల్లలకు బైకులు,ఇతర వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయి.మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.గ్రామంలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి.గంజాయి,డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే మన గ్రామం, మండలం సురక్షితంగా ఉంటుందని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.