Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అంబేద్కర్ కళాభవనం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

Author
Posted By Telangana Vaartha
| 07 Oct 2026, 07:19 PM | తాజా వార్తలు
అంబేద్కర్ కళాభవనం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

వనపర్తి జిల్లాలోని 21వ వార్డు మారెమ్మకుంట దగ్గర అంబేద్కర్ కళాభవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు మరియు డీఎస్సీ డిఓ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు ఈ సందర్భంగా అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి అనువైన స్థలం సర్వేనెంబర్ 1063 లో 1 ఎకరా ఆరుకుంటల భూమి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి మౌలిక సదుపాయాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్థలంలో మొలిచిన కంప చెట్లను తొలగించి స్థలం కబ్జా కాకుండా సర్వే చేయించి సరైన హద్దులను గుర్తించి కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు చింతకుంట విశ్వం బాబు ద్యారపోగు వెంకటేష్ చిన్నమ్మ తామస్ కమర్ రహమాన్ కోరారు కళాభవనం నిర్మాణం ద్వారా దళితులకు బహుజనులకు కళాకారులకు విద్యార్థులకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మంచి వేదిక అందుబాటులోకి వస్తుందని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ప్రభుత్వము ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కోరారు స్థల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు నివేదికను ఉన్నత అధికారులకు సమర్పించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు

ఈ కార్యక్రమంలో డీఎస్సీ డివో రాంజీ రావు ప్రభుత్వ వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చింతకుంట విశ్వం బాబు ద్యారపోగు వెంకటేష్ చిన్నమ్మ తామస్ కమ్మర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు

🇮🇪💐🙏ఇట్లు🙏💐🇮🇪
ద్యారపోగు వెంకటేష్
ప్రభుత్వ వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.