Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు బస్సు భవనం ముందు ధర్నాను జయప్రదం చేయండి

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 07:52 PM | తాజా వార్తలు
ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు బస్సు భవనం ముందు ధర్నాను జయప్రదం చేయండి

ఎన్‌పీఆర్‌డీ జిల్లా కోశాధికారి కొత్త లలిత
భువనగిరి 6 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-
భువనగిరి టౌన్ 6వ వార్డులో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ)6వ వార్డు కమిటీ సమావేశం జరిగింది అనంతరం ఎన్ పి ఆర్ డి సంగం సభ్యత్వం క్యాంపెయిన్ చేపించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా కోశాధికారి కొత్త లలిత మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీని అమలు చేయకపోవడం బాధాకరం అని అన్నారు.వికలాంగులకు వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల 8న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు బస్సు భవనం ముందు నిర్వహించే ధర్నాను జిల్లావ్యాప్తంగా వికలాంగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కొత్త లలిత పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నాగునూరి బాల బ్రహ్మం నాగునూరి అంజలి జాంగిర్ జయమ్మ యాదమ్మ వెంకటేశం తదితరు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.