Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బతుకమ్మ ఘాట్‌ పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 06 Oct 2026, 10:57 AM | తెలంగాణ Telangana
బతుకమ్మ ఘాట్‌ పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్

తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట బతుకమ్మ ఘాట్‌ వద్ద ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి,జేసీబీ సహాయంతో ఘాట్ పరిసరాలు మరియు నిమజ్జన ప్రాంతాన్ని క్లీన్ చేయించి సిద్ధం చేయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న,మున్సిపల్ వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్ ,కౌన్సిలర్లు జ్యోతి నరోతం రెడ్డి, త్రిశూల్,స్థానిక నాయకులు సామ ఆంజనేయులు,తాడిశెట్టి రమేష్,పసుపులేటి సత్యనారాయణ,గుండ ఈశ్వరయ్య,సందీప్ నేత,కిషోర్ రెడ్డి,నాగరాజు,సర్ధార్,సుమన్,విజయ్,అశోక్ మున్సిపల్ సిబ్బంది,పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.