Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇటీవల భారీ వర్షానికి తడిసి ముద్దయిన బంతి తోట

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 02 Oct 2026, 11:31 AM | తెలంగాణ Telangana
ఇటీవల భారీ వర్షానికి తడిసి ముద్దయిన బంతి తోట

తిరుమలగిరి 02 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట కౌలుకు తీసుకొని ఒక ఎకరం భూమిలో బంతిపూల తోట సాగు చేసుకుంటున్న మహిళ రైతు యాదమ్మ కు కన్నీళ్లే మిగిలాయి ఇటీవల అకాల వర్షాలకు బంతి తోట పూర్తిగా నీళ్లల్లో మునిగి ధ్వంసం అయింది యాదమ్మ రైతు మాట్లాడుతూ బంతిసాగు మాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఒక ఎకరం పంట వేసి..లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టా. సుమారు 20 క్వింటాలు రావాల్సిన దిగుబడి 4క్వింటాలు మాత్రమే వచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా దక్కలేదు. రూ. 80 వేల రూపాయలకు పైగా నష్టం వచ్చింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి కోరారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.