Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉచితంగా మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు

Author
Posted By Telangana Vaartha
| 30 Sep 2026, 11:34 PM | తెలంగాణ Telangana
ఉచితంగా మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు

తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి స్వచ్ఛతా హి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున, వారి ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ మల్లెల వందన, కౌన్సిలర్స్ పనికర లక్ష్మి, కారు పోతుల సోమలక్ష్మి, తిరుమణి యాదగిరి, బత్తుల శ్రీనివాస్, కన్నెబోయిన మల్లయ్య, భూక్య యాకూబ్, కో ఆప్షన్ మెంబర్ దేశియా నాయక్, మున్సిపల్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.