Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలి

Author
Posted By Telangana Vaartha
| 28 Sep 2026, 12:54 AM |
పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు

సూర్యాపేట: ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, పట్టభద్రులు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం.జెడ్. ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందకపోవడం, పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తనను శాసనమండలికి పంపితే పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను మండలిలో ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల రామకృష్ణ, సాయి శిరీష, ఎడమ రాజేష్, సరికొప్పుల విజయలక్ష్మి, నాగేశ్వరరావు, రామగిరి శివసాయి, అరవింద్ కుమార్, పసుపులేటి రామారావు, సాయినాయుడు, ఏవీ రావు, అజయ్,4 నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.