Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పేదలకు కడుపునిండా అన్నం పెట్టే సన్న బియ్యం పథకం సంతృప్తినిచ్చింది

Author
Posted By Telangana Vaartha
| 28 Sep 2026, 12:49 AM | హైదరాబాద్
పేదలకు కడుపునిండా అన్నం పెట్టే సన్న బియ్యం పథకం సంతృప్తినిచ్చింది

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదు
స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి.

Suryapet:- పేదలకు కడుపునిండా అన్నం పెట్టే సన్న బియ్యం పథకం ఎంతో సంతృప్తినిచ్చిందని రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజుర్నగర్ వి వి ఎం స్కూల్ లో హుజుర్నగర్, మట్టంపల్లి మండలాల చెందిన అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తమ ప్రభుత్వమని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 16.32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. తెలంగాణలో మొత్తం కలిపి1,06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, దీంతో 3,42,57,109 మంది నిరుపేదలు ఆహార భద్రత లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం కలిపి 3,72,658 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో మొత్తం రేషన్ కార్డుల 1,08,011 ఉండగా ఈ రోజు కొత్తగా హుజుర్నగర్ మండలంలో 21,395, మట్టంపల్లి మండలంలో 16,203 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి అన్నారు. సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలకు కడుపునిండా భోజనం పెడుతున్నామని గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన దొడ్డుబియ్యం కోళ్ల ఫారాలు, బీర్ల తయారీ, రైస్ మిల్లర్లు అక్రమ వ్యాపారానికి స్కామ్ గా ఉపయోగపడ్డాయని తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నామని రాష్ట్రంలో 85% మంది జనాభా కు కడుపునిండా అన్నం పెట్టే పథకం పెట్టడం చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, అర్హులై ఉండి ఎవరికైనా కార్డు రాని వారు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నచో కొత్త రేషన్ కార్డు ఇప్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ కే నరసింహ, అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా దేశ్ ముఖ్, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ బచ్చు రామారావు, హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, తాసిల్దార్ కవిత ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.