Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోషకాహారంపై అవగాహన

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 05:09 PM | Array
పోషకాహారంపై అవగాహన

జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ఎర్రవల్లి. మండలంలోని షేక్ పల్లి గ్రామంలో శుక్రవారం 2వ, అంగన్వాడి కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ వెంకటేశ్వరమ్మ అవగాహన కల్పించారు. కారపాకుల గార్లపాడు వీరాపురం గ్రామాల టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ హేమలత మాట్లాడుతూ. రక్తహీనత నివారణకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నారులకు బాలామృతం, గుడ్లు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు తదితరులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.