Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భారీ వర్షంలోనూ విధుల్లో సూర్యాపేట జిల్లా పోలీసులు..

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 02:31 AM | హైదరాబాద్
భారీ వర్షంలోనూ విధుల్లో సూర్యాపేట జిల్లా పోలీసులు..

అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ గణేష్ నిమజ్జనాల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ శోభాయాత్రలు, నిమజ్జనాల సందర్భంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీసు సిబ్బంది రహదారులపై బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, శోభాయాత్రలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షంలోనూ విధులకు హాజరై ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసుల సేవాభావం అభినందనీయం. వర్షం కురిసినా... విధుల్లో మాత్రం విరామం లేదు.

భారీ వర్షంలోనూ విధుల్లో సూర్యాపేట జిల్లా పోలీసులు.. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.