Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పిడుగుపాటుకు బాలుడు మృతి

Author
Posted By A.Timma Gurudu
| 21 Sep 2026, 07:25 PM | Array
పిడుగుపాటుకు బాలుడు మృతి

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 16 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందిన విషాద ఘటన కేటీ దొడ్డి మండలం యర్సన్‌దొడ్డి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన కుర్వ వెంకటేష్ కుమారుడు మల్లేష్ (16) పొలం నుంచి ఇంటికి వస్తుండగా వర్షం కురిసింది. దీంతో కృష్ణస్వామి దేవాలయం సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి నిల్చున్నాడు.అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.