Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అంజనాపురిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

Author
Posted By Telangana Vaartha
| 20 Sep 2026, 08:42 PM | హైదరాబాద్
అంజనాపురిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు

సూర్యాపేట జిల్లా కేంద్రం..... గణనాథుడికి 31 రకాల ప్రసాదాలతో ప్రత్యేక నైవేద్యం
నిత్య అన్నదానంతో కాలనీలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం
సూర్యాపేట:
అంజనాపురి కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి 31 రకాల ప్రసాదాలతో ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాలనీలో భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు. నిత్య అన్నదానం నిర్వహించడం ద్వారా అంజనాపురి కాలనీలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.