మహిళల సాధికారత కోసం కొట్లాడి నిధులు తెస్తా

నారీ నైపుణ్య స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ఖమ్మం, నవంబర్ 3:- ఖమ్మం మహిళల సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హామి ఇచ్చారు..పేదరికంలో ఉన్న, ఒంటరి మహిళలు స్వయంకృషి, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపాన 'ది గాడ్ థైరిస్సా మహిళా మండలి' ఆధ్వర్యంలో 'కే.సీ.పుల్లయ్య ఫౌండేషన్',' కెపిసి ప్రాజెక్టు లిమిటేడ్ కంపెనీ' సౌజన్యంతో ఏర్పాటు చేసిన 'నారీ నైపుణ్య శిక్షణా కేంద్రం'( ఉచిత మహిళా కుట్టు...