మొరుసు తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలి

- చలితో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం. - రైతులు కోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. - విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లకు దూరంగా ఉండాలి. - అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో ప్రయాణాలు చేయవద్దు. - అత్యవసర సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన మొరుసు తుఫాను ప్రభావం సూర్యాపేట జిల్లాపై ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు. వాతావరణ పరిస్థితుల ప్రకారం రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, భారీ...