ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ రామన్నపేట 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం కక్కిరేణి గ్రామాలలో సభ్యత్వం క్యాంపెన్లో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఆ హామీని అమలు చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వికలాంగులు,వృద్ధులు, వితంతువులు,ఇతర చేయూత పింఛన్దారులు ప్రభుత్వ ప్రకటనలపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు.కానీ ప్రభుత్వం హామీలు...