నాగేశ్వర్ రెడ్డి కి - ఘన నివాళులు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన శ్రీ పరంధామ్ రెడ్డి కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద విషయం తెలుసుకున్న వెంటనే అలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు * వారి స్వగృహానికి వెళ్లి, నాగేశ్వర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.