శిథిలావస్థలో విద్యుత్ స్తంభం పట్టించుకోని అధికారులు
ఎస్.ఈకి ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఏడీఈ జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల మండలం కాకులారం గ్రామంలో ఎల్లాగౌడ్ ఇంటిముందు విద్యుత్ స్తంభం శిథిలావస్థలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆ వీధి ప్రజలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలం నుండి విద్యుత్ స్తంభం వల్ల కరెంటు వేర్లు చెట్టుకు తాకడం వల్ల భయంకరమైన నిప్పురవ్వలు రాలుతూ ఉన్నాయి.విద్యుత్ స్తంభం మధ్యలో రావి చెట్టుతో పాటు తీగలు తగిలి ఉండడంతో విద్యుత్తు స్తంభం నుండి వైర్లు కరెంటు సరఫరా అయ్యి భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేటి వరకు పట్టించుకోలేదని బాధితుడు వాపోయారు. గతంలో ప్రజాపాలనలో గ్రామంలో ఉన్న...