సొంత ఖర్చుతో బేబీ కిట్ల పంపిణీ సర్పంచ్ విజయ్ కుమార్ లోని మానవత్వానికి నిదర్శనం.
నవజాత శిశువుల కుటుంబాలకు అండగా సర్పంచ్ - గ్రామంలో ప్రశంసలు. జోగులాంబ గద్వాల2 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- ధరూర్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ డిఆర్ విజయ్ కుమార్ తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ఎలాంటి ప్రభుత్వ నిధులు కాకుండా, పూర్తిగా తన సొంత ఖర్చులతో నవజాత శిశువులకు బేబీ కిట్లు పంపిణీ చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామానికి పెద్దగా, ప్రజా సేవకుడిగా తన బాధ్యతను నిరూపిస్తూ, పుట్టిన ప్రతి బిడ్డను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.ముగ్గురు చిన్నారులకు బేబీ కిట్లు: ఇందులో భాగంగా ధరూర్ గ్రామానికి...