మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ కమిషన్లు వస్తాయనే ఆశతో మోసపోవద్దు. ప్రజల కష్టార్జిత సంపాదనను కాపాడుకోవాలి – ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్. సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా ప్రజలు మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), చైన్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో, సరైన వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి పథకాలలో పెట్టుబడులు పెట్టి కష్టార్జిత సంపాదనను కోల్పోవద్దని హెచ్చరించారు. జిల్లాలో కొంతమంది వ్యక్తులు ఎలక్ట్రిక్ బైక్లు, మాగ్నెటిక్ పరుపులు, మ్యాజిక్ వాటర్ బాటిళ్లు, మ్యాజిక్ రిస్ట్ బ్యాండ్లు, టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, ఎలక్ట్రానిక్...