అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిట్ల సేకరణ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

డిపాజిట్ పై వారానికి 10 శాతం, నెలకు 40 శాతం వడ్డీ ఇస్తామనే హామీలను నమ్మవద్దు. అత్యాశకు లోనై కష్టార్జిత సొమ్మును కోల్పోవద్దు – జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్. సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా ప్రజలు అధిక వడ్డీలు చెల్లిస్తామనే ఆకర్షణీయమైన హామీలతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో ఎలాంటి విచారణ లేకుండా వ్యక్తులు లేదా సంస్థల వద్ద డబ్బులు డిపాజిట్ చేసి తమ కష్టార్జిత సంపాదనను కోల్పోవద్దని హెచ్చరించారు. జిల్లాలో కొంతమంది వ్యక్తులు ప్రజలకు అసాధారణమైన అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ ఆశ చూపి,...