38 ఏళ్ల నిష్కళంక వైద్య సేవలకు ఘన వీడ్కోలు

ముఖ్యమైన పాయింట్స్:వైద్య రంగంలో సంధ్యారాణి సేవలు చిరస్మరణీయం ఖమ్మం:- ప్రభుత్వ వైద్య రంగంలో 38 ఏళ్ల పాటు అంకితభావంతో, నిష్కళంకంగా సేవలందించిన నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి పదవీ విరమణ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సాధారణ నర్సుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి నర్సింగ్ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన ఆమె సేవలు ఆదర్శనీయమని వైద్యులు, అధికారులు కొనియాడారు. విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరుతో 38 ఏళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించడం అభినందనీయమన్నారు. ఆమె సేవలు నేటి నర్సింగ్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఆమెతో కలిసి పనిచేసిన...