16 రోజులు గడిచినా శ్రవణ్ మృతి కేసులో నివేదికలు ఎక్కడ

సూర్యాపేట జిల్లా..... బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు వ్యవస్థ పై మండిపడ్డ లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్... బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు లంబాడి విద్యార్థి సేన పోరాటం ఆగదు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి 16 రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని వంకుడోతు శ్రవణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి సంబంధించిన అసలు నిజాలు ఇప్పటికీ తెలియడం లేదని, పోలీసులను అడిగినా సరైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోస్టుమార్టం నివేదిక అందలేదని, CDR, ఫోరెన్సిక్ నివేదికలపై కూడా స్పష్టమైన సమాచారం...