657 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

వారం రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించాలి.. 100 రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 319 ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 657 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, 100 రోజుల్లో పూర్తి చేసుకోవాలని సూచించారు....