ఐకెపి కేంద్ర నిర్వాహకులకు శిక్షణ

తిరుమలగిరి 01 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ఖరీఫ్ సీజన్ లో మార్కెట్ నిర్వహణ కోసo అన్ని గ్రామాల్లో ఐకెపి సెంటర్ల నిర్వాహకులు సిద్ధం చేసుకొని ఉండాలని తహసిల్దార్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం మండల సమాఖ్య లో నాగారం, తిరుమలగిరి మండలాల గ్రామాలలో ఐకెపి నిర్వాహకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏలాంటి ఇబ్బంది జరగకుండా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అందుకు అనుగుణంగా కేంద్రం నిర్వాహకులు పనిచేయాలని చెప్పారు. మార్కెటింగ్ డిపిఎం అరుణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం విక్రయించకుండా ఐకెపి కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించే...