సర్దార్ పటేల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఖమ్మం:- భారత తొలి ఉపప్రధాని, మాజీ హోంమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను బీజేపీ ఖమ్మం 1వ టౌన్ అధ్యక్షుడు గడీల నరేష్ ఆధ్వర్యంలో గుర్రాల బొమ్మ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పటేల్ సుమారు 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేశారని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంలోనూ ఆయన కీలక...