పట్టపగలే వెలుగుతున్న స్ట్రీట్ లైట్లు
ముఖ్యమైన పాయింట్స్:- విద్యుత్ వృధా, పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని హీరో హోండా షోరూం నుండి జమ్మిచెడు వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఉన్న హై మాస్ట్ లైట్లు మరియు సెంట్రల్ లైటింగ్ సిస్టం పగటిపూట కూడా ఆన్ లోనే ఉండటం గమనార్హం. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ఇలా పగటిపూట లైట్లు వెలుగుతూ ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం పిలుపునిస్తుంటే, మరోవైపు మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల...