మహిళలకు ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయం.

ముఖ్యమైన పాయింట్స్:చేయూత' పెన్షన్ తక్షణ మంజూరు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా లో పింఛన్ లబ్ధిదారుడైన భర్త మరణించినప్పుడు ఆయన భార్యకు తక్షణ పెన్షన్ అందించే ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. పెన్షన్ పొందుతున్న భర్తలు మరణించిన సందర్భాల్లో వారి భార్యలకు తక్షణమే సామాజిక భద్రతా పెన్షన్ మంజూరు చేసే ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయాన్ని ప్రభుత్వం మరిన్ని పింఛన్ కేటగిరీలకు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన...