నీటిని వృధా చేయొద్దు.. కరెంటును ఆధా చేసుకుందాం
ముఖ్యమైన పాయింట్స్:.. ఎంపీడీవో శంకరయ్య అడ్డగూడూరు 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్నినో ప్రభావంపై,కలెక్టర్ ఆదేశాల మేరకు తేదీ 22.10.26 నుండి ప్రతి గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామసభలలో భాగంగా చివరి రోజున కంచనపల్లి గ్రామంలో సర్పంచ్ చెడే అంబేద్కర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా..ఉప సర్పంచ్ బెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం రోజు గ్రామసభ నిర్వహించారు.గ్రామసభలో ఎంపీడీవో మాట్లాడుతూ..ప్రస్తుతము కరువుకాలం సమీపించినందున ప్రజలు నీటిని కరెంటును పొదుపుగా వాడుకోవాలని,మునగ గడ్డి సాగు చేయాలనుకునే వారికి ప్రభుత్వము ఎకరానికి 14 వేలు అందిస్తుందని, అదేవిధంగా ఇండ్ల ముందు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, అందుకుగాను ప్రభుత్వము 6200 చెల్లిస్తుందని తెలిపారు. అదేవిధంగా రైతులు ముందుకు...