విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలి ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ టోర్నమెంట్ నూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారు రాణించేలా ప్రోత్సహించాలని తెలిపారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయకులు అందిస్తుందన్నారు, అలాగే ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది. విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...