డాక్టర్ రోహిణి రొండ్లకు ఏఎస్‌టీసీ జీవితకాల సభ్యత్వం

సూర్యాపేట,అక్టోబర్ 31:- విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలందించిన హైదరాబాద్‌లోని విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీజేఐటీ) కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రోహిణి రొండ్లకు అరుదైన గౌరవం లభించింది. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) జీవితకాల సభ్యత్వానికి ఆమె ఎంపికయ్యారు. 2026 అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఏఎస్‌టీసీ, సీఎస్‌ఐఆర్, ఎన్‌జీఆర్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక సదస్సు ప్రారంభ సమావేశంలో ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ చేతుల మీదుగా డాక్టర్ రోహిణి రొండ్ల జీవితకాల సభ్యత్వ ధ్రువీకరణ...