తిరుమలగిరిలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు

తిరుమలగిరి 31అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి బాలబాలికల అండర్-14, అండర్-17 కబడ్డీ క్రీడా పోటీలు నేడు తిరుమలగిరి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, పిటి అంబేద్కర్ తెలిపారు.ఈ క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ , జిల్లా విద్యాశాఖ అధికారి హాజరవుతున్నారన్నారు జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు ఈ క్రీడోత్సవాల్లో పాల్గొంటారని వారు తెలియజేశారు.