కోతుల దాడిలో వృద్ధునికి గాయాలు
తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో విపరీతమైన కోతుల బెడద తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు శుక్రవారం పనిమీద బయటకు వెళ్లిన వృద్ధుడు బొమ్మిడి చంద్రయ్య (85) పై కోతులు తీవ్రంగా దాడి చేశాయి ఇలా రోజు గ్రామస్తులపై కోతులు వరుసగా దాడులు చేస్తుండడంతో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఇతర పనులపై బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు సంబంధిత అధికారులు అటవీశాఖ అధికారులతో మాట్లాడి కోతులను పట్టించి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.