అస్లాంను అభినందించిన స్థానికులు
జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మానవసేవే మాధవసేవగా భావించే అస్లామును స్థానికులు శుక్రవారం నాడు అభినందించారు. ఆయన సేవలు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి ఆపదలో ఆపద్బాంధవుడు లాగా ఎన్నంటి ఉండి నడిపించే వ్యక్తి అస్లాం. ఈ మధ్యకాలంలో స్వయంప్రభ సాహిత నాయుడు సంపాదకత్వంలో 75 మంది కవుల చే రచింపబడిన అస్తిత్వం కవిత సంకలనం యొక్క ఆవిష్కరణ సభ హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో గురువారం సాయంత్రం జరిగింది. సభకు ఉమ్మడి జిల్లా నుంచి అస్లాం ఒక్కరే వెళ్లడం ఆరుదైన గౌరవం కవితగా రచించినందుకు అందరికీ అర్థమయ్యే విధంగా కవితలు రచించినందుకు అస్లామును సభికులు అభినందించారు....